Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ విహారయాత్రకు వెళ్లి కన్నుమూసిన శివసేన ఎమ్మెల్యే

Shiv Sena MLA Ramesh Latke died in Dubai vacation
  • కుటుంబంతో కలిసి విహారయాత్ర 
  • గుండెపోటుకు గురైన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే
  • అంథేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం  
కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ చూసొద్దామని వెళ్లిన మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎమ్మెల్యే రమేశ్ లట్కే విషాదకర పరిస్థితుల్లో కన్నుమూశారు. దుబాయ్ విహారయాత్రలో ఉండగా రమేశ్ లట్కే గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని శివసేన వర్గాలు మీడియాకు వెల్లడించాయి. బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని శివసేన నేత ఒకరు తెలిపారు.

రమేశ్ లట్కే వయసు 52 ఏళ్లు. ముంబయిలోని అంథేరీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఆయన ముంబయి నగరపాలక సంస్థలో కార్పొరేటర్ గా సేవలందించారు. కాగా, రమేశ్ లట్కే మృతదేహాన్ని దుబాయ్ నుంచి నేడు ముంబయికి తీసుకురానున్నారు.
Ramesh Latke
Demise
Dubai
Vacation

More Telugu News